జీ తెలుగులో పాపులర్ షో ‘డ్రామా జూనియర్స్’ సూపర్ జోష్ గా ఆడిషన్స్ ని నిర్వహిస్తోంది. సీజన్ 6 తో త్వరలో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ ఐపోతోంది. ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టిన ఈ షో ఇప్పుడు మరింత ఎనర్జిటిక్ గా రాబోతోంది. 5 సీజన్‌లను పూర్తి చేసిన ఈ షో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారి కోసం ఆడిషన్స్ ని నిర్వహిస్తోంది. డ్రామా జూనియర్స్ సీజన్ 6 కోసం, 3 నుండి 13 సంవత్సరాల వయసు ఉండి చక్కగా నటించగల, పాడగల టాలెంట్ ఉన్న పిల్లల కోసం వెతుకుతోంది జీ తెలుగు. డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ మంచి యాక్టివ్ గా సాగుతున్నాయి.
తమ యాక్టింగ్ టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు చిచ్చర పిడుగులు..ఆ ఆడిషన్స్ జరిగే వీడియోని రిలీజ్ చేసింది జీ. ఐతే ఇప్పటివరకు ఈ షోకి ఇన్ని సీజన్స్ కి హోస్ట్స్ గా రవి, ప్రదీప్, శ్రీముఖి చేశారు. ఇక ఈ నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు అనే విషయం ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. అలాగే ఈ షోకి జడ్జెస్ గా అనసూయ, అలీ, కృష్ణ రెడ్డి, రేణు దేశాయ్, సింగర్ సునీత, ఓంకార్ లాంటి ఎంతో మంది వచ్చారు. కానీ సీజన్ 6 కి మాత్రం ఒక కమెడియన్ రాబోతున్నట్టుగా జీ తెలుగు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ డేట్ చేసింది. "కామెడి అతని సొంతం, నవ్వించడం అతని వరం!! ఆ జడ్జ్ ఎవరో గెస్ చేయండి.."అంటూ ఆడియన్స్ కి ఒక టాస్క్ కూడా ఇచ్చింది. ఐతే అందరూ బ్రమ్మి, బ్రహ్మానందం అని కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే "అందం, టాలెంట్ & తేజస్సు కలిగిన స్టార్ సెలబ్రిటీ మొట్టమొదటిసారిగా తెలుగు టెలివిజన్ లోకి అడుగుపెట్టబోతుంది!! ఎవరో తెలుసా.." అనే ప్రశ్న కూడా వేసింది. దానికి లయ అని, తమన్నా అని, ప్రేమ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కొత్త సీజన్ కి హోస్ట్ ఎవరు, జడ్జెస్ ఎవరు, ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరు అనే విషయాలు తెలియాలంటే డ్రామా జూనియర్స్ సీజన్ 6 కోసం కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే..